Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జబర్దస్త్ షోకు రష్మీ గుడ్ బై చెప్పేస్తుందా? అనసూయకు వరమేనా?

Advertiesment
జబర్దస్త్ షోకు రష్మీ గుడ్ బై చెప్పేస్తుందా? అనసూయకు వరమేనా?
, శనివారం, 10 ఏప్రియల్ 2021 (19:19 IST)
జబర్దస్త్ షోకు కమెడియన్లు హిట్ టాక్ తెస్తుంటే.. ఈ కామెడీ షో విజయం సాధించడానికి యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఒక ప్రధాన కారణం. ఈమె కోసమే కామెడీ షో చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదిరిపోయే హాట్ షో చేస్తూ మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ మొదట్లో అనసూయ యాంకర్‌గా ఉండేది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల తో తప్పుకోవడంతో రష్మి గౌతమ్ వచ్చింది. వచ్చీ రావడంతోనే సెన్సేషనల్ హాట్ షో చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ భామ.
 
అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ షోను వదలలేదు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా జబర్దస్త్‌కు దూరంగా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఈమె కూడా మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈమె జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు పారితోషికం పెంచకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇంకా బయట నుంచి ఆఫర్లు రావడంతో జబర్దస్త్ నుంచి తప్పుకోవాలని రష్మీ గౌతమ్ యోచిస్తున్నట్లు సమాచారం.
 
అయితే ఇదే విషయం మల్లెమాల దగ్గర చర్చించి పారితోషికం పెంచితే ఇక్కడే ఉండాలా..? లేదా ? అనే నిర్ణయం రష్మి గౌతమ్ తీసుకుంటుంది. లేదంటే మాత్రం ఈమె జబర్దస్త్‌కు దూరంగా వెళ్ళడం దాదాపు ఖాయం అయిపోయింది. ఇప్పటికే జెమిని, మా టీవీల్లో ఈమె రెండు కార్యక్రమాలకు యాంకర్ గా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అందుకే జబర్దస్త్ షో కు గుడ్ బై చెప్పాలని భావిస్తుంది. ఏదేమైనా రష్మి గౌతమ్ జబర్దస్త్ షో వదిలేస్తే మాత్రం అనసూయకు అది వరంగా మారనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Trend: పవన్ వకీల్ సాబ్‌కు ఫిదా అయిన వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు!