Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి రోజే చివరి రోజైంది... ఎస్.ఐ దుర్మరణం

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (14:26 IST)
తాను నడుపుతున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడటంతో భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కోన మధుసూదన్ (33) కన్నుమూశారు. ఆయన పెళ్ళిరోజే చనిపోయారు. ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే, నల్లగొండలో నిర్వహిస్తున్న పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల విధులు నిర్వహించేందుకు భూదాన్‌పోచంపల్లి నుంచి స్వయంగా పోలీస్‌ సుమో వాహనం నడుపుతూ ఇంటి నుంచి ఉదయం 4.30 గంటలకు ఆయన బయలుదేరారు. 
 
ఆయన వాహనం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను బెటాలియన్‌ పోలీసులు 108 వాహనంలో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి 5.30 గంటలకు తరలించారు. గంటకు పైగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. చివరకు తుదిశ్వాస విడించారు.
 
ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వచ్చిన మధుసూదన్... సోమవారం రాచకొండ ఉత్సవాల్లో కూడా విధులు నిర్వహించారు. సెలవు కావాలని ఉన్నతాధికారులను కోరడంతో రెండు రోజులు సెలవు ఇచ్చిన అధికారులు రాత్రి సెలవు రద్దు చేస్తున్నామని ఈవెంట్స్‌ విధులకు వెళ్లాలని ఆదేశించడంతో డ్రైవర్‌ లేకుండానే విధులకు సిద్ధమయ్యాడు. 
 
తన కుమార్తె అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి వెళ్తున్నట్లు డ్రైవర్‌ చెప్పడంతో మధుసూదన్‌ అతడికి సెలవు ఇచ్చాడు. స్వయంగా వాహనం నడపడం, అనారోగ్యం, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సెలవు ఇచ్చినట్టే ఇచ్చి గంటల వ్యవధిలోనే రద్దు చేశారని, అదే తమ కుటుంబానికి అండలేకుండా చేసిందని వారు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments