కావలసిన పదార్థాలు:
తులసి ఆకులు - అరకప్పు
ఆలివ్ నూనె - 3 స్పూన్స్
వెల్లుల్లి - 3
ఉల్లిపాయలు - 2
క్యారెట్స్ - 2
టమోటాలు - 2
కూరగాయలు ఉడికించిన నీరు - ఒకటిన్నర లీటర్
ఉప్పు - సరిపడా
మిరియాల - కొద్దిగా
నిమ్మ చెక్క - చిన్నది.
తయారీ విధానం:
ముందుగా పాన్‌లో ఆలివ్ నూనె వేడిచేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, క్యారెట్, సన్నగా తరిగిన ఆకుకూరలు వేయాలి. 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత అందులో తరిగిన టమోటాలు, కూరగాయల నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆపై ఈ మిశ్రమంలో తులసి ఆకులు, ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే ఘుమఘుమలాడే టమోటా సూప్ రెడీ.