Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొన్నాళ్ల తరువాత హన్సిక బ్రేకప్ చెప్పేసింది.. మళ్లీ ఇప్పుడు..?(Video)

Advertiesment
కొన్నాళ్ల తరువాత హన్సిక బ్రేకప్ చెప్పేసింది.. మళ్లీ ఇప్పుడు..?(Video)
, బుధవారం, 6 మార్చి 2019 (14:16 IST)
హన్సిక దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయమయ్యారు. హీరోయిన్‌గా పరిచయమైనది తెలుగులోనే అయినా ఆ తరువాత కోలీవుడ్‌కు వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో కంటే.. తమిళంలో సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. 15 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన హన్సిక అప్పుడే 50 సినిమాల మార్కును అందేసుకుంది. 
 
ప్రస్తుతం హన్సిక ఓ కొత్త సినిమాలో నటిస్తుంది. హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం 'మహా'. ఇది హన్సిక 50వ చిత్రం. ఈ సినిమా మొదటి లుక్ ఇప్పటికే వార్తల్లో నిలిచింది. మహా సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కారణం హన్సిక మాజీ ప్రియుడు శింబు. సోలోగా సక్సెస్ కోసం సతమతమవుతున్న శింబు ఈ మధ్య కాలంలో అతిథి పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు.
 
గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 90 ఎంఎల్ చిత్రంలో శింబు అతిథి పాత్ర పోషించడంతో పాటు ఓవియాకు ఘాటు లిప్‌లాక్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మళ్లీ 'మహా' చిత్రంలోనూ అతిథి పాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
 
అనుకున్న సమయం కంటే ముందుగానే న్యూస్ లీకైంది. నేను, శింబు మహా చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్నాం అంటూ.. హన్సిక ట్విట్ చేసింది. ఇప్పటికే పోస్టర్ వివాదంతో మంచి పబ్లిసిటీ సాధించిన ఈ సినిమా.. శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి చర్చకు దారి తీసింది.

హన్సిక శింబుతో ప్రేమాయణం నడుపుతోందని రెండు సంవత్సరాల క్రితం వార్తలు హల్‌చల్ చేశాయి. కొన్నాళ్ల తరువాత హన్సిక బ్రేకప్ చెప్పేసింది.. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి తెరపై కనివిందు చేయనున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫారిన్‌కు పాకిన జబర్దస్త్ క్రేజ్...ఇంతకీ అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా?