''అత్తారింటికి దారేది'' తమిళ రీమేక్: శింబు ఓవరాక్షన్ ముంచేసిందా?

శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:14 IST)
తమిళ ''అత్తారింటికి దారేది'' సినిమాపై నెగటివ్ టాక్‌ వచ్చింది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమా భారీ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళంలో శింబు హీరోగా తెరకెక్కించారు. శింబు సరసన కేథరిన్ .. మేఘ ఆకాశ్ మెరిశారు. కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ నటించింది. 
 
శుక్రవారం తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. కథాకథనాల పరంగా ఈ సినిమా మొత్తం ఆసక్తిగా లేదని.. శింబు ఓవరాక్షన్ వెగటు పుట్టించిందని.. టాక్. ఇంకా తెలుగులో సమంతలా మేఘా ఆకాశ్ ఆకట్టుకోలేకపోయిందని.. సింబు స్టైలిష్‌గా కనబడినా డైలాగులు బాగున్నా.. తమిళ అత్తారింటికి దారేదిలో ఏదో మిస్ అయ్యిందని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్రతి ఒక్కరినీ కన్నీరు తెప్పించిన యాత్ర అసిస్టెంట్ డైరెక్టర్ స్పీచ్...