Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైదానంలో అభిమానిని ఆటపట్టించిన ఎమ్మెస్ ధోనీ...(Video)

Advertiesment
మైదానంలో అభిమానిని ఆటపట్టించిన ఎమ్మెస్ ధోనీ...(Video)
, బుధవారం, 6 మార్చి 2019 (10:42 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 40 ఏళ్లలోనూ సరికొత్త రికార్డులతో అదరగొడుతున్నాడు. టీమిండియాను ప్రతీ మ్యాచ్‌లోనూ గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తాడు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో టీమిండియా క్రికెటర్లకు మెలకువలు చెప్తూ ముందుకు నడుపుతున్నాడు. 


ఇలా టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో ఉన్నత స్థానంలో నిలబెట్టిన ధోనీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. అలాంటి ధోనీని కలిసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. ధోనీ ఎక్కడైనా కనిపించాడో.. అక్కడ ఆయన పాదాలపై పడిపోవడం సెల్ఫీలు దిగడం మామూలైపోయింది.
 
క్రికెట్ స్టేడియంలోనూ ఇలాంటి ఘటనలు జరిగివున్నాయి. మైదానంలో వచ్చేసే ధోనీ ఫ్యాన్స్ ఆయన కాలిపై పడటం వంటివి జరిగిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం తాజాగా అలా మైదానంలోకి ధోనీని చూసేందుకు వచ్చిన ఓ అభిమానిని కూల్ కెప్టెన్ ఆటపట్టించాడు. రెండో వన్డే రెండో సెషన్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

సెక్యూరిటీని దాటుకుని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చిన అభిమానిని వికెట్ల వరకు పరుగున వెళ్లి అక్కడ చెయ్యి కలిపాడు. అలా కాసేపు అభిమానిని పరిగెత్తింపజేశాడు. 
webdunia
 
నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే సందర్భంగా జరిగిన ఈ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రెండో సెషన్‌లో భారత్‌ జట్టు ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వెళుతోంది. ఆ సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ధోనీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
 
ఆ అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోనీ మైదానంలో పరుగందుకున్నాడు. అయినా ఆ వీరాభిమాని వదలకుండా ధోనీ వెంటపడడంతో చివరికి వికెట్ల వద్దకు వెళ్లి ఆగిపోయాడు.
webdunia


వచ్చిన అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో అతను ఆనందంతో ముందు కాలిపై పడ్డాడు. ఆ తర్వాత ధోనీని ఆలింగనం చేసుకున్నాడు. ఇలా అభిమానిని కాసేపు పరుగెత్తి ఆటపట్టించిన ధోనీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాంటింగ్ రికార్డు బద్దలు.. సచిన్ మైలురాయిపై కన్నేసిన కోహ్లీ