Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాంటింగ్ రికార్డు బద్దలు.. సచిన్ మైలురాయిపై కన్నేసిన కోహ్లీ

Advertiesment
పాంటింగ్ రికార్డు బద్దలు.. సచిన్ మైలురాయిపై కన్నేసిన కోహ్లీ
, బుధవారం, 6 మార్చి 2019 (08:58 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ దూకుడు మామూలుగా లేదు. ప్రతి మ్యాచ్‌లోనూ కసితీరా బౌలర్లను చితకబాదుతూ పరుగులను పిండుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది. అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 9 వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
 
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్ ఖాతాలో ఉండేది. ఇపుడు ఈ రికార్డును కోహ్లీ బద్దలు కొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన సారథిగా ఘనత సాధించాడు. 
 
రెండో వన్డేలో 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ కెప్టెన్‌గా 159 ఇన్నింగ్స్‌ల్లో 9 వేలు పూర్తి చేస్తే.. పాంటింగ్‌ అందుకు 203 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. 
 
అంతర్జాతీయ క్రికెట్లో 9000 పరుగులు చేసిన కెప్టెన్లలో కోహ్లీకి ముందు స్మిత్‌ (220 ఇన్నింగ్స్‌లు), ధోని (253), అలెన్‌ బోర్డర్‌ (257), ఫ్లెమింగ్‌ (272)లు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే, ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన 40వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో 9 సెంచరీలు కొడితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీ (49) రికార్డు కూడా కనుమరుగుకానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్కంఠపోరులో టీమిండియా జయభేరి... 500వ విక్టరీ...