Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ముసలివాడినయ్యా.. ఎన్టీఆర్ అందంగా ఉన్నాడన్న స్టార్ డైరెక్టర్

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (19:11 IST)
ఆయన తెలుగు సినీపరిశ్రమలో ఒక లెజెండ్ డైరెక్టర్. సరిగ్గా 19 యేళ్ళ క్రితం శాంతినివాసం అనే సీరియల్ తీసిన ఆయన ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాను తీశాడు. అందులో హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్. జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టిన సినిమా.
 
జూనియర్ ఎన్టీఆర్ ఎంతో లావుగా ఆ సినిమాలో కనిపించాడు. అయినా ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆదరించారు. ఆ సినిమా దాదాపుగా 70 శాతం రామోజీ ఫిలింసిటీలోనే జరిగింది. సినిమా నేటితో 18 యేళ్ళు పూర్తయ్యింది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో రాజమౌళి గతాన్ని గుర్తుచేసుకున్నాడు. 
 
సరిగ్గా 18 యేళ్ళ క్రితం నేను జూనియర్ ఎన్టీఆర్‌కి ఇక్కడే కూర్చుని కథను వివరించా.. మళ్ళీ ఇప్పుడు అక్కడే కూర్చుని ఎన్టీఆర్‌కు కథను వివరిస్తున్నా అంటూ అప్పటి ఫోటో.. ఇప్పటి ఫోటోను జతచేసి ట్విట్టర్ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు. నేను ముసలివాడినయ్యానంటూ అందులో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు తమాషాగా కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments