Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్ సినిమాను మించిన ట్విస్టులు.. మెరిట్ లిస్ట్ పెట్టకపోవడమే భారీ స్కామ్

Advertiesment
త్రివిక్రమ్ సినిమాను మించిన ట్విస్టులు.. మెరిట్ లిస్ట్ పెట్టకపోవడమే భారీ స్కామ్
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (13:03 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన సచివాలయ ఉద్యోగాల ప్రక్రియలో అపశృతి దొర్లింది. ఈ పరీక్షల కోసం తయారు చేసిన ప్రశ్నపత్రం లీకైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. పైగా, ఏపీపీఎస్సీలో పని చేసిన ఉద్యోగులకు చెందిన కుటుంబ సభ్యులు, వారి స్నేహితులకు మాత్రమే మెరుగైన ర్యాంకులు వచ్చాయి. అయితే, అర్హత సాధించిన తుది జాబితాను మాత్రం ఏపీపీఎస్సీ వెల్లడించలేదు. 
 
దీనిపై గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందిస్తూ, కలెక్టర్లకు జిల్లాలవారీ అర్హత జాబితాలను పంపామని, వారు పోస్టుల వారీగా, కేటగిరీ, సబ్‌ కేటగిరీల వారీగా జాబితా తయారు చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపడతారన్నారు. 
 
ఆ వెంటనే అభ్యర్థుల నుంచి ఆయనకు ప్రశ్నలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు ఉండనంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. మెరిట్‌ లిస్టు పెట్టకపోతే పెద్ద స్కాం చేస్తున్నట్లే లెక్క అని ఒకరు, ఫైనల్‌ కీ ఇచ్చే వరకు చాలా వేగంగా జరిగిన ప్రక్రియ ఇప్పుడెందుకు ఇంత వెనుకబడిందో అర్థం కావడం లేదని మరొకరు.. ద్వివేదికి ట్వీట్‌ చేశారు. 
 
'అవినీతి స్థాయి పెరిగేకొద్ది మా ర్యాంకులు కూడా పెరుగుతున్నాయా? బాగా అమ్ముకుంటున్నారా?' అంటూ ఒక అభ్యర్థి ఆవేదనతో ప్రశ్నించారు. కేటగిరి-1 ర్యాంకులు ఉన్నఫళంగా ఎందుకు మారిపోయాయని వినయ్‌కుమార్‌ అనే అభ్యర్థి ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనల్డ్ ట్రంప్: ‘నేను పాక్ స్నేహితుణ్ణి.. ఇమ్రాన్ గొప్ప నాయకుడు.. మోదీ ప్రకటన దూకుడుగా ఉంది’