Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

దేవీ
గురువారం, 28 ఆగస్టు 2025 (17:36 IST)
Naga Chaitanya, Sparsh Srivastava
తండేల్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న తన 24వ చిత్రానికి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో కలిసి పనిచేస్తున్నారు. మిథికల్ థ్రిల్లర్ థ్రిల్లర్ గా రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
 
కాగా, ఈ సినిమాలో లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవను కీలక పాత్రలోకి తీసుకున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవాస్తవ, ఇప్పుడు తొలిసారి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో పాత్-బ్రేకింగ్ అవుతుందని శ్రీవాస్తవకి టీమ్ బెస్ట్ విషెస్ తెలిపింది.
 
“NC24 – The Excavation Begins” ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన వెంటనే బిగ్ బజ్ క్రియేట్ చేసింది. సినిమా స్కేలు, ఇంటెన్స్ మూడ్‌ని ప్రజెంట్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరినీ ఆకట్టుకుంది.
 
#NC24 మిస్టరీ, ఎమోషన్, గ్రాండ్ విజువల్స్‌తో జానర్-డిఫైనింగ్ మైథికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. కార్తిక్ డండు యూనిక్ స్టోరీటెల్లింగ్, SVCC – సుకుమార్ రైటింగ్స్ స్ట్రాంగ్ సపోర్ట్, నాగచైతన్య కొత్త డైమెన్షన్‌లో యాక్టింగ్, ఇప్పుడు స్పర్ష్ శ్రీవాస్తవ లాంటి యాక్టర్స్ జాయిన్ అవ్వడంతో, సినిమాపై అన్ని ఇండస్ట్రీస్‌లోనూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి. మైథ్-బేస్డ్ థ్రిల్లర్స్ కి కొత్త బౌండరీలు చూపించేలా ఒక వరల్డ్-క్లాస్ సినిమా ఇవ్వాలని టీమ్ కాంప్రమైజ్ కాకుండా పనిచేస్తోంది.
 
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల మొదలుకానుంది. సినిమా జర్నీ గురించి మరిన్ని ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: తెలుగు రాజకీయాల్లో విడిపోయిన మరో కుటుంబం.. టీడీపీలోకి కవిత ఎంట్రీ ఇస్తారా?

నోబెల్ పురస్కారానికి సిఫార్సు చేయలేదనే భారత్‌పై ట్రంప్ అక్కసు.. అందుకే సుంకాల పోటు

Nara Lokesh: జగన్ ప్రవర్తనపై మండిపడ్డ నారా లోకేష్.. తల్లికి విలువ లేదు.. అయినా ప్రేమ మారదు

ట్రంప్ సర్కారుకు అమెరికా ఫెడరల్ కోర్టులో షాక్

KA Paul: కవితకు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్.. ప్రజాశాంతిలో చేరుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments