Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Advertiesment
Naga Chaitanya

దేవీ

, శనివారం, 26 ఏప్రియల్ 2025 (18:06 IST)
Naga Chaitanya
నాగ చైతన్య 'తండేల్' విజయం తర్వాత మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. బోల్డ్ ఛాయిసెస్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌ తో ఆదరగొట్టె నాగచైతన్య, తన తొలి సూపర్ నేచురల్ థ్రిల్లర్ విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరూ కలసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ని చేయబోతున్నారు. NC24 ఈ జానర్ ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు, బాపినీడు సమర్పిస్తున్నారు.
 
ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి తెర వెనుక వున్న రేర్ సీన్స్ ని ప్రజెంట్ చేస్తూ "NC24 - ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్" ఎలక్ట్రిఫైయింగ్ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సంవత్సరాల తరబడి ఆలోచనల, నెలల తరబడి ఇంటెన్స్  ప్రీ-ప్రొడక్షన్, రోజుల తరబడి కఠినమైన రిహార్సల్స్ వరకు ఈ సినిమాటిక్ వండర్ కు ప్రాణం పోసే హార్డ్ వర్క్ ని ఈ వీడియో ప్రజెంట్ చేస్తోంది.
 
నాగ చైతన్య తన పాత్ర కోసం ఫిజికల్ గా, మెంటల్ గా కంప్లీట్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. ఈ వీడియోలో గూస్బంప్స్ ఇచ్చే సీన్స్ వున్నాయి. ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, నీల్ డి కున్హా డీవోపీగా వర్క్ చేస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటర్.
 
భారీ స్థాయిలో నిర్మాణం, అద్భుతమైన కథ, టాప్ టెక్నీషియన్స్, నాగ చైతన్య మాజికల్ ప్రెజెన్స్ వంటి అంశాలతో NC24 నాగ చైతన్య కెరీర్‌లో ఒక కీలకమైన మైలురాయి గానే కాదు, మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో గ్రౌండ్ బ్రేకింగ్ మూవీగా నిలవబోతోంది.
 
సినిమా టైటిల్, మిగిలిన నటీనటుల గురించి మరిన్ని వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
 
తారాగణం: యువసామ్రాట్ నాగ చైతన్య
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాత: BVSN ప్రసాద్, సుకుమార్ B
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: నీల్ డి కున్హా
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
కాస్ట్యూమ్స్: అర్చన రావు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి