Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

Advertiesment
Naga Chaitanya 24 Poster

డీవీ

, శనివారం, 23 నవంబరు 2024 (14:17 IST)
Naga Chaitanya 24 Poster
నాగచైతన్య 24వ సినిమాను సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మించనున్నారు. నేడు నాగచైతన్య పుట్టినరోజు పురస్కరించుకుని పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య కొత్త సినిమా పోస్టర్ ను విడుదలచేశారు. గత ఏడాది సాయి దుర్గా తేజ్‌, సంయుక్త  మీనన్‌లతో కార్తీక్‌ దండు దర్శకత్వంలో బ్లాక్‌బస్టర్‌ 'మిస్టికల్‌ థ్రిల్లర్‌ 'విరూపాక్ష' చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలోనే ఈ తాజా చిత్రాన్ని భారీ చిత్రాల మేకర్‌ ప్రముఖ  బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
 
ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ఇది ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తించింది. "NC24" అనే వర్కింగ్‌ టైటిల్‌తో, ఈ చిత్రం డిసెంబరులో షూటింగ్ ప్రారంభించుకోనుంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
కార్తీక్ దండు ఈ ప్రాజెక్ట్ కోసం అత్యుత్తమ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి అధిక స్థాయిలో CG వర్క్ ఉండనుంది, ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్‌  అనుభూతిని అందించేందుకు సహాయపడుతుంది. శ్యామ్‌ దత్‌  ISC సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌కు బాధ్యతలు స్వీకరించగా, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. కాంతారా మరియు విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకున్న అజనీష్ లోక్‌నాథ్ ఈ థ్రిల్లర్‌కు సంగీతం అందించనున్నారు. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి