Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

Advertiesment
SS Rajamouli

డీవీ

, శనివారం, 23 నవంబరు 2024 (13:58 IST)
SS Rajamouli
స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడాలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ‌మౌళి..  స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో సిద్ధం చేసిన నిర్వ‌హ‌కులను అభినందించారు.
 
webdunia
Star doctors with SS Rajamouli
ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్ఎస్ రాజ‌మౌళి మాట్లాడుతూ.. "స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థ మన హైదరాబాద్‌లో ప్రారంభం కావడం ఎంతో గర్వకారణం. లివర్ అనేది మన శరీరానికి ముఖ్యమైన భాగం. ఇలాంటి విభాగానికి ప్రత్యేకమైన సంరక్షణ అందించేందుకు ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపొందించిన ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ఖాయం. డాక్టర్ రవీంద్రనాథ్ గారు, డాక్టర్ మెట్టూ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడి బృందం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఇన్‌స్టిట్యూట్ కేవలం హైదరాబాద్‌ మాత్రమే కాదు, దేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదుగుతుంది." అని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.
 
స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రజలకు ప్రపంచ స్థాయి లివర్ కేర్ అందించడంతో పాటు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వ‌హకులు తెలిపారు. స్టార్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, స్టార్‌ హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌ గూడపాటి, స్టార్‌ లివర్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెంటార్‌ డాక్టర్‌ కే రవీంద్రనాథ్‌, డాక్టర్‌ మెట్టు శ్రీనివాస్‌ రెడ్డి , రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, డాక్టర్ రమేష్ కంచర్ల పాల్గొని, ఈ గొప్ప కార్యాన్ని ప్రారంభించ‌డానికి వ‌చ్చిన రాజ‌మౌళికి.. ధ‌న్య‌వాదాలు తెలిపారు.
 
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, వైద్యనిపుణులు, అతిథులు ఆసుపత్రి సౌకర్యాలు, సేవలను ప్రశంసించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం