Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

Jani Master

సెల్వి

, శనివారం, 23 నవంబరు 2024 (13:07 IST)
కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. జానీ మాస్టర్ బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
 
ఈ మేరకు తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. అయితే ఈ పిటిషన్ విషయంలో జానీ మాస్టర్‌కు ఊరట లభించింది. సుప్రీం కోర్టు ధర్మాసనం పిటిషను డిస్మిస్ చేసింది. 
 
ఇకపోతే.. తనను లైంగికంగా వేధించారంటూ తోటి మహిళా కొరియోగ్రాఫర్‌ జామీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ను అరెస్ట్‌ చేయగా ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు. 37 రోజుల పాటు జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్‌ 24వ తేదీన బెయిల్‌ను అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం