Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీగా నిఖిల్ సిద్ధార్థ్ చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

Nikhil Siddharth

డీవీ

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (19:05 IST)
Nikhil Siddharth
కార్తికేయ 2  హీరో నిఖిల్ ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నటిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమా కావ‌టంతో సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.
 
సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ దీన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌ల చేసిన సినిమా ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ద‌స‌రా సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో నిఖిల్ రిషి అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారని టీజ‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. త‌న‌కు, హీరోయిన్ రుక్మిణి వ‌సంత్‌కు మ‌ధ్య ల‌వ్ ట్రాక్‌, వారి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్క‌గా ఉంది. అలాగే ఇద్ద‌రి మ‌ధ్య‌లో తెలియ‌ని మ‌రో సీక్రెట్ ల‌వ్ స్టోరీ ఏదో ఉంద‌నే క్యూరియాసిటీ కూడా క‌లుగుతోంది. అదే హీరోయిన్‌ దివ్యాంశ కౌశిక్‌. అస‌లు వీరి ముగ్గురు మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. అలాగే టీజ‌ర్‌లోని యాక్ష‌న్ ఎలిమెంట్స్ ఆస‌క్తిక‌రంగా ఆక‌ట్టుకంటున్నాయి.
 
గూజ్ బ‌మ్స్ తెప్పించే చేజింగ్ స‌న్నివేశాలు, క‌థ‌లోని కీల‌క మ‌లుపులు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒక‌ యాక్ష‌న్ ప్యాక్డ్ మూవీ అని రివీల్ చేస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమాను న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, చ‌క్క‌టి కామెడీ, రొమాన్స్ స‌హా అన్నీ అంశాల‌తో సినిమా రూపొందింది. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. ఈసారి నిఖిల్, సుధీర్ వ‌ర్మ కాంబోలో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ ప‌క్కా అని తెలుస్తుంది.
 
క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీలో మంచి పాపుల‌ర్ హీరోయిన్‌గా అంద‌రినీ అల‌రిస్తోన్న రుక్మిణి వ‌సంత్ .. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. మ‌రో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. హ‌ర్ష చెముడు ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. యోగేష్ సుధాక‌ర్‌, సునీల్ షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్స్‌. బాపినీడు.బి ఈ చిత్రానికి స‌మ‌ర్పణ‌. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 8న‌ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవర కలెక్షన్స్ రిపోర్ట్ రహస్యాన్ని బయటపెట్టిన నిర్మాత నాగవంశీ