Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

Vijay Sethupathi  ACE  first look

డీవీ

, శుక్రవారం, 17 మే 2024 (19:16 IST)
Vijay Sethupathi ACE first look
విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ లో ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. యోగి బాబు, పి.ఎస్. అవినాష్, దివ్య పిళ్లై, బబ్లూ, రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  కరణ్ బహదూర్ రావత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనింగ్ ఎ.కె. ముత్తు,  ఆర్. గోవిందరాజ్ ఎడిటింగ్.  'ఏసీఈ' అనే డిఫరెంట్ టైటిల్ తో రూపొందుతున్న ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ గా నిర్మిస్తుంది.
 
సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో రివీల్ చేసిన ఫస్ట్ లుక్ లో విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్, డైస్ వేస్తూ కనిపించి అందరినీ ఆకర్షించారు. ఇది సినిమా గురించి అభిమానులలో క్యురియాసిటీని పెంచింది. స్టార్ కాస్ట్, ఆకట్టుకునే నేపథ్య సంగీతం, విజయ్ సేతుపతి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని ప్రజెంట్ చేసిన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. జూదం, తుపాకులు, పేలుళ్లు, రాబరీస్, బైక్ ఛేజింగ్ వంటి అంశాలు అలరించాయి. టీజర్‌లో యోగి బాబు కామిక్ రియాక్షన్ హ్యుమర్ రేకెత్తిస్తుంది.  ఇది సినిమా హిలేరియస్  క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలియజేస్తుంది.  ఈ విజువల్ గ్లింప్స్, టైటిల్ ప్రివ్యూ, జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేసిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు యానిమేటెడ్ ఫార్మాట్‌లో పాత్రల యొక్క ముఖ్యమైన అంశాలు రివిల్ చేయడం వల్ల ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోంది. సినిమా సింగిల్ ట్రాక్,  టీజర్‌ని అభిమానులందరూ ఆస్వాదించేలా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ టీమ్ అనౌన్స్ చేసింది.
 
ఈ ఏడాది ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతికి ‘ఏసీఈ’ రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ