Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గొడ్డలి, జూట్ రోప్ పట్టుకుని హైదరాబాద్‌లో యాక్షన్ సీన్స్ లో నాగచైతన్య షూటింగ్

Advertiesment
NC24  Action sean

దేవీ

, శుక్రవారం, 4 జులై 2025 (17:18 IST)
NC24 Action sean
నాగ చైతన్య 'తండేల్' తర్వాత విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో మిథికల్ థ్రిల్లల్ ని చేస్తున్నారు. NC24 ఈ జానర్ ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. 
 
ఇటీవల మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. రషెస్ తో థ్రిల్‌గా ఉంది. ఇప్పుడు, మరింత ఉత్సాహంతో హైదరాబాద్‌లో నెల రోజుల పాటు జరిగే కీలకమైన రెండవ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌ లో నాగ చైతన్య, ఇతర పరిశ్రమల నుండి ప్రముఖ నటులు కూడా పాల్గొంటున్నారు.

ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. నాగ చైతన్య ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో జూట్ రోప్ పట్టుకుని కనిపిస్తున్న న్యూ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'One step deeper, one swing closer,”అనే లైన్ ఇంట్రస్టింగ్ గా వుంది.  
 
నాగ చైతన్య కెరీర్‌లో హయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ బిగ్గెస్ట్ హైలెట్ గా ఉండబోతోంది. ఇది మరింత బజ్‌ను పెంచుతుంది. టైటిల్, ప్రధాన తారాగణాన్ని త్వరలో అనౌన్స్ చేస్తారు.
 
ఇప్పటికే మేకర్స్ “NC24 – ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్” అనే గ్రిప్పింగ్ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
 
ఈ చిత్రానికి అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందించగా, రఘుల్ ధరుమాన్ సినిమాటోగ్రఫర్. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!