Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్స్ మీ కోసం సర్‌ప్రైజ్ వుందన్న ప్రభాస్.. రానా ఏమన్నారు..?

Webdunia
సోమవారం, 20 మే 2019 (14:49 IST)
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. ''డార్లింగ్స్ మీ కోసం సర్‌ప్రైజ్ వుందని".. బాహుబలి స్టార్ ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. బాహుబలి-2 బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ''సాహో'' సినిమా నుంచి త్వరలో ట్రైలర్ విడుదల కానుందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే సాహో ఈ సినిమా మేకింగ్‌ వీడియోలను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా మే 21న ''సాహో'' సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేశారు.

తన సోషల్‌మీడియా ఖాతాలో దాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనికి బాహుబలి భల్లాలదేవుడు.. రానా రిప్లై ఇచ్చారు. ''సర్‌ప్రైజ్‌ కోసం ఎదురుచూస్తున్నా..'' అని పోస్ట్‌ చేశారు. బహుశా.. మంగళవారం సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఇకపోతే.. సాహో చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments