Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ముగ్గురు హీరోల దెబ్బకు రోజుకి 4 గంటలే నిద్రపోయిన పూజా హెగ్డే...

Advertiesment
Puja Hegde
, బుధవారం, 8 మే 2019 (21:31 IST)
పాతరోజుల్లో సూపర్ స్టార్ క్రిష్ణ మూడు షిప్టుల్లో మూడుసార్లు వర్క్ చేసినట్లు విన్నాం. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించదు. అయితే ఇప్పటి హీరోలు రెండు షిప్టులలో పనిచేసినా అది ఒక మూవీకే. అయితే క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం మూడు షిప్టుల్లో మూడు సినిమాల్లో ముగ్గురు సినిమాలతో నటించింది. 
 
దువ్వాడ జగన్నాథం తరువాత పూజా హెగ్డే వరుస ఛాన్సులను అందుకుంది. తెలుగు స్టార్స్ దృష్టి ఈ అమ్మడిపై పడగా ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌తో ఒకేసారి జతకట్టే ఛాన్స్ అందుకుంది. ఈ ముగ్గురు హీరోలకు కాల్ షీట్లు ఇవ్వలేక నానా అవస్థలు పడింది పూజా. అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్‌తో నటిస్తూ ఉండగానే మహర్షిలో మహేష్ బాబుతో ఛాన్స్ అందుకుంది. రాధాక్రిష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మూవీలోను పూజా హెగ్డే సెలక్టయ్యింది. ఈ మూడు సినిమాల షూటింగ్ ఒకేసారి నడవడం.. ఈ అమ్మడు డేట్స్ ఒకేసారి కావాల్సి  వచ్చింది. 
 
అరవింద షూటింగ్ హైదరాబాద్‌లోను, మహర్షి షూటింగ్ రాజస్థాన్‌లో జరగడంతో ఈ అమ్మడు కోసం నిర్మాతలు ఫ్లైట్స్ బుక్ చేశారు. దీంతో ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ కోసం పూజా హెగ్డే 20 గంటల పాటు కష్టపడిందట. మహర్షి ప్రమోషన్లో ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు అరవింద సమేత వీరరాఘవ షూటింగ్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మహర్షి సెట్స్‌లో, రాత్రి 9 నుంచి అర్థరాత్రి 2గంటల వరకు ప్రభాస్ మూవీలో కాల్షీట్లు ఇచ్చి అందరికీ న్యాయం చేసింది. 
 
ఈ హడావిడిలో రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోయిందట పూజా హెగ్డే. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్‌కు దక్కని అరుదైన గౌరవాన్ని వెనకేసుకుంది ఈ క్రేజీ హీరోయిన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛీ... ఛీ.. ఇంకెప్పుడూ మీ హోటల్‌కి రానంటే రానంతే...