Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీబీఎస్ఈ 10, 12 పరీక్షా ఫలితాలు విడుదల.. 31,14,821 మంది రాశారు(Video)

సీబీఎస్ఈ 10, 12 పరీక్షా ఫలితాలు విడుదల.. 31,14,821 మంది రాశారు(Video)
, గురువారం, 2 మే 2019 (13:15 IST)
సీబీఎస్ఈ పదో తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2019 సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు సీబీఎస్‌ఈడాట్.ఎన్ఐసీడాట్ఇన్ అనే వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీబీఎస్ఈరిజల్ట్స్‌డాట్ఎన్ఐసిడాట్‌ఇన్ అనే వెబ్‌సైట్‌లోనూ పొందవచ్చు.


సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను 2018-19 సంవత్సరానికి గాను.. ఫిబ్రవరి-మార్చి 2019 నెలల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
దేశ వ్యాప్తంగా 31,14,821 మంది విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షలను రాశారు. ఇందులో 28 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. ఈ పరీక్షలు 4,974 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. ఇంకా విదేశాల్లో 78 సెంటర్లలో ఈ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించింది.

ఇందులో ఇంటర్ విద్యార్థులు మాత్రం 13లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12 ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ సీబీఎస్‌ఈడాట్.ఎన్ఐసీడాట్ఇన్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. 
webdunia
 
ఈ వెబ్‌సైట్ మాత్రమే కాకుండా సీబీఎస్‌ఈడాట్ఎగ్జామ్‌రిజల్ట్స్‌డాట్‌నెట్, సీబీఎస్‌ఈరిజల్ట్స్‌డాట్‌ఎన్ఐసి‌డాట్ఇన్, రిజల్ట్స్‌డాట్‌జీవోవీడాట్ఇన్ అనే వెబ్‌సైట్లలో కూడా ఫలితాలను పొందవచ్చునని సీబీఎస్ఈ ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో జనసేనకు ఐదు ఎంపీ సీట్లు ఖాయం.. కేసీఆర్ అంటే భయం లేదు...?