Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో జనసేనకు ఐదు ఎంపీ సీట్లు ఖాయం.. కేసీఆర్ అంటే భయం లేదు...?

ఏపీలో జనసేనకు ఐదు ఎంపీ సీట్లు ఖాయం.. కేసీఆర్ అంటే భయం లేదు...?
, గురువారం, 2 మే 2019 (12:25 IST)
ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఒకటి లేదా రెండుకు మించి సీట్లు రావని ప్రచారం సోగుతోంది. అనధికారిక సర్వేలు మాత్రం 14-22 అసెంబ్లీ సీట్లు, 2-3 లోక్‌సభ సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నప్పటికీ.. జనసేన ఒకట్రెండు సీట్లకే పరిమితమని ప్రచారం సాగుతోంది.


కానీ ఊహాగానాలపై పరోక్షంగా స్పందించిన జనసేన.. ఏపీలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని పేర్కొంది. జనసేనకు ఐదు ఎంపీ సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేసింది.
 
గాజువాక నియోజకవర్గ జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జనసేన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌ మాదాసు గంగాధరం మాట్లాడుతూ.. ఐదు లోక్‌సభ స్థానాల్లో జనసేన గెలుస్తుందని తెలిపారు.
 
విశాఖపట్నం, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ లోక్‌‌సభ స్థానాల్లో విజయం సాధిస్తాం. మిగిలిన లోక్‌ సభ స్థానాల్లోనూ పార్టీ గట్టిపోటీ ఇచ్చింది. ఏపీలో మార్పు మొదలైందని.. మే 23న ఏపీలో అనూహ్య ఫలితాలు వెలువడతాయని మాదాసు వ్యాఖ్యానించారు.   
 
జనసేన నేతలు ప్రజాసేవలో బిజీగా ఉంటే ప్రత్యర్థులు సీబీఐ కేసులతో బిజీగా ఉన్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు అన్నారు. రఘురామకృష్ణం రాజు వంటి నేతలు ఎంపీలయితే వేల కోట్లు దోచుకొని మాల్యాలా విదేశాలకు పారిపోతారు. 
 
తెలంగాణలోనూ పనిచేసే దమ్ము జనసేనకు ఉందన్నారు నాగబాబు. కేసీఆర్ అంటే తమకు భయం లేదని..ఆయనపై గౌరవం మాత్రమే ఉందని చెప్పారు. ఇది కేవలం టీజర్ అని మే 23న ఫలితాలు వెలువడ్డాక అసలు సినిమా చూపిస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో కోడలు పడకగదిలో ఏకాంతం.. చూసేసిన అత్త... ఆ తరువాత?