Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ తప్పుడు లెక్కలతో చాలామందికి ఇబ్బందులు : విజయసాయికి వీవీ కౌంటర్

Advertiesment
మీ తప్పుడు లెక్కలతో చాలామందికి ఇబ్బందులు : విజయసాయికి వీవీ కౌంటర్
, శనివారం, 20 ఏప్రియల్ 2019 (10:59 IST)
తనపై సైటెర్లు వేసిన వైకాపా నేత విజయసాయి రెడ్డికి జనసేన పార్టీ నేత, ఆ పార్టీ వైజాగ్ అభ్యర్థి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి. లక్ష్మీనారాయణ సరైన కౌంటర్ ఇచ్చిన. జనసేన పార్టీ పోటీ చేసిందే 65 స్థానాలు అయితే, 88 సీట్లలో గెలుస్తామని ఎలా చెబుతారు జేడీ? అంటూ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. 
 
వీటికి మాజీ జేడీ వీవీలక్ష్మీనారాయణ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. 'మీరు సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో అర్థం కావడంలేదు' అంటూ ట్వీట్ చేశారు. 
 
"జనసేన పార్టీ సొంతంగా పోటీచేసింది 140 స్థానాల్లో. మిత్రధర్మం ప్రకారం బీఎస్పీకి 21, వామపక్షాలకు 14 సీట్లు కేటాయించాం. ఆ విధంగా మొత్తం 175 స్థానాల్లో జనసేన దాని మిత్రపక్షాలు పోటీచేశాయి. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగా ఉంటాయి. ఇప్పుడు లెక్కలు సరిచూసుకోవాల్సింది మీరే. మేం సత్యం, న్యాయం అనే అంశాల ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఇప్పటికే మీ తప్పుడు లెక్కల వల్ల అనేకమంది ఇరుక్కున్నారు. ఇకనైనా మంచి లెక్కలు నేర్పే విధానాన్ని మొదలుపెట్టండి" అంటూ ఘాటుగా బదులిచ్చారు.
 
జగన్ అక్రమాస్తుల కేసులో అనేక ఆర్థిక అవకతవకలు జరిగాయని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. జగన్ కంపెనీలకు ఆడిటింగ్ నిర్వహించి, ఆర్థిక లావాదేవీల లెక్కలను పర్యవేక్షించింది విజయసాయిరెడ్డి కావడంతో లక్ష్మీనారాయణ ఆ కోణంలో పరోక్ష వ్యాఖ్య చేసినట్టు అర్థమవుతోంది. జగన్‌పై అక్రమ మైనింగ్, అక్రమాస్తుల కేసులను సీబీఐ జేడీ హోదాలో లక్ష్మీనారాయణ కొన్నేళ్లపాటు విచారించిన విషయం తెల్సిందే. ఆయన వల్లే జగన్‌తో పాటు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలు జైలుపాలయ్యారనే వాదనలు లేకపోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకోమన్నందుకు అక్కడ కర్రపెట్టి గాయపరిచారు...