Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేడీ కాదు.. వీవీ.. అందరూ గమనించగలరు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విన్నపం

జేడీ కాదు.. వీవీ.. అందరూ గమనించగలరు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విన్నపం
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:05 IST)
మామూలుగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమను తాము పరిచయం చేసుకోవడానికి ఎక్కువ సమయం కావలసి ఉంటుంది. అయితే అటువంటి ఇబ్బంది లేకుండా తమ స్వంత గుర్తింపుని కలిగి ఉండే కొంత మంది ఉంటారు. అటువంటి వాళ్లల్లో ఇటీవలే జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఉంటారు. ఈయన విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనకి ఉన్న ఓవర్ పబ్లిసిటీనే తన కొంప ముంచేస్తుందేమోనని ఆయనే దిగులుపడుతున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... అసలు పేరు వీవీ లక్ష్మీనారాయణ అయినప్పటికీ... ఆయన నిర్వర్తించిన జేడీ పదవిని ఆయనకు ఇంటి పేరుగా మార్చి 'జేడీ' లక్ష్మీనారాయణ అనే పేరుతో అందరికీ సుపరిచితులు కావడం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడా 'జేడీ' అనే పదమే తన కొంప ముంచుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'జేడీ' అనేది మీడియా అందించిన ఇంటి పేరు. కానీ ఆయన నిజమైన ఇంటిపేరు 'వీవీ'. 
 
ఈవీఎంలో కూడా 'వీవీ లక్ష్మీనారాయణ' అనే ఉంటుంది. దీనితో ఆయన తన పేరుని అందరూ 'జేడీ లక్ష్మీనారాయణ'గా భావిస్తూ... ఈవీఎంలో కనిపిస్తున్న 'వీవీ లక్ష్మీనారాయణ' అనే పేరుని మరో వ్యక్తిగా పొరబడే ప్రమాదం ఉందని ఆయన దిగులు పడుతున్నారు. దానితో, ఆయన తన ప్రచారంలో భాగంగా తన పేరు గురించి వివరిస్తూ... తన పేరు 'వీవీ లక్ష్మీనారాయణ' అనీ, ఈవీఎంలో సీరియల్ నం.7లో గాజు గ్లాసు గుర్తుకు ఎదురుగా ఉంటుందనీ విడమర్చి మరీ చెప్పుకొస్తున్నారు. అప్పుడప్పుడూ ఓవర్ పబ్లిసిటీ కూడా కొంప ముంచేస్తుందంటే ఇదేనేమో మరి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత నిఘా వ్యవస్థలో సరికొత్త అస్త్రం