మహారాష్ట్ర గడ్చిరోలిలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేశారు. ఈ ఘటనలో వాహన డ్రైవర్‌తో పాటు 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం మధ్యాహ్నం గడ్చిరోలికి బలగాల కాన్వాయ్ వెళుతుండగా, మావోయిస్టులు ఈఐడీ పేల్చారు. ఈ పేలుడు ధాటికి భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహన తునాతునకలైపోయింది. రోడ్డు మధ్యలో భారీ గొయ్యి కూడా ఏర్పడింది. ఈ దాడి అనంతరం మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే, ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు ఎదురు కాల్పులు జరుపారు.
ఈ దాడికి ముందు పురాందా - మాలేగావ్ - యెర్కడ్ జాతీయ రహదారిని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన 36 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పది కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టంవాటిల్లింది. బుధవారం మహారాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.