Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీకి ప్రచారం చేసిన శునకం.. అరెస్టు చేసిన పోలీసులు

బీజేపీకి ప్రచారం చేసిన శునకం.. అరెస్టు చేసిన పోలీసులు
, మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (12:36 IST)
పోలీసులకు ఓ చిక్కువచ్చి పడింది. ఓ శునకం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తోందంటూ విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు... వేరే గత్యంతరం లేక ఆ శునకాన్ని అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియల్లో భాగంగా ఈనెల 28వ తేదీన నాలుగో దశ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ దశలో మహారాష్ట్రలోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. 
 
అయితే, నందుర్భార్‌‌లో ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే ఆ శునకం మాత్రం బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేసింది. తన పెంపుడు కుక్కకు అంటించిన స్టిక్కర్లలో "మోడీకి ఓటేయండి, దేశాన్ని కాపాడండి" అన్న నినాదాన్ని కూడా రాశాడు. దాన్ని పోలింగ్ రోజు బయటకు తీసుకువచ్చాడు. 
 
ఇక రోడ్డుపై కుక్క ప్రచారాన్ని చూసిన ఇతర పార్టీల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే, రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు... శునకాన్ని అరెస్టు చేశారు. ఈసీ నిబంధనలను అమలు చేసే విషయంలో తమకు మనుషులైనా, జంతువులైనా ఒకటేనని నిరూపించారు.
 
ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన చర్యలు ఉన్నాయని తేల్చిన పోలీసులు ఏక్‌నాథ్‌పై కేసు పెట్టి, ఆ కుక్కను కూడా స్టేషన్‌కు తరలించారు. అయితే, ఆ శునకం ఆలనా, పాలనా తాము చూడలేమని, వెంటనే ఈ శునకాన్ని తీసుకెళ్లాలని మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెను తుఫానుగా ఫణి.. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం..