Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరి ఎమోషనల్ ట్వీట్... వాడిని ఎంతో బాధపెట్టాను.. ఇక వాడు లేడు

Advertiesment
పూరి ఎమోషనల్ ట్వీట్... వాడిని ఎంతో బాధపెట్టాను.. ఇక వాడు లేడు
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (11:33 IST)
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ పెంచుకుంటున్న కుక్క మరణించడంతో ఆయన విషాదంలో మునిగిపోయారు. పూరికి జంతువులున్నా, పక్షులన్నా చాలా ప్రేమ, ఇక తాను పెంచుకుంటున్న జాక్స్‌పై ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


జాక్స్ మరణం గురించి ట్విట్టర్‌లో ప్రస్తావిస్తూ పూరి జగన్నాధ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఆయన షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే జాక్స్ అంత్యక్రియలు సంప్రదాయబద్దంగా జరిగినట్లు కనిపిస్తోంది.
 
‘వీడి పేరు జాక్స్. ఎప్పుడూ నాతోనే ఉండేది. ఒకానొక టైంలో వీడిని పెంచే పరిస్థితి లేక నా ఫ్రెండుకి ఇచ్చేశాను. ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ తీసుకొచ్చేసాను. కానీ వాడు హర్ట్ అయ్యి అప్పటి నుండి నాతో మాట్లాడటం మానేసాడు. దగ్గరకు రాడు, నా వైపు చూడడు, తోక కూడా ఊపి ఇప్పటికి 8 సం అయ్యింది. నేను లైఫ్‌లో ఎంతమందిని బాధపెట్టానో నాకు తెలియదు కాని వీడిని మాత్రం చాలా బాధ పెట్టాను. వాడు ఇంక లేడు. Today is his last day' అని ట్వీట్ చేసారు. ఆయనను ఓదారుస్తూ చార్మి, నిధి అగర్వాల్, హేమంత్ మధుకర్, ఎస్‌కేఎన్ ఇంకా పలువురు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్స్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్నర్స్ ధరించకుండా.. టవల్‌తో స్పాలో కనిపించిన యాషికా ఆనంద్..