Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

ఈ శునకం.. 30మందిని కాపాడింది.. కానీ దాని ప్రాణం మాత్రం?

Advertiesment
Pet dog
, శనివారం, 13 ఏప్రియల్ 2019 (16:08 IST)
విశ్వాసానికి మారుపేరు శునకం. అన్నం పెట్టిన యజమానిని అదెప్పుడూ మరిచిపోదు. యజమానిని కాపాడుకోవడానికి ఇంటి ముందు కాచుకు కూర్చుంటుంది. అలా ఇంట పెంచిన ఓ పెంపుడు కుక్క 30 మంది ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన యూపీలోని బాందా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. ఓ భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడాన్ని గమనించిన శునకం గట్టిగా మొరగడం మొదలెట్టింది. 
 
దాన్ని అరుపులు విన్న జనం.. ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చేశారు. భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగడం చూసిన జనాలు తమ ప్రాణాలను చేతిలో పట్టుకుని పరుగులు తీశారు. కానీ ఇంతగా 30 మంది ప్రాణాలు కాపాడిన శునకం మాత్రం చివరికి మృతి చెందింది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు జనం పరుగులు తీశారే కానీ.. ఆ శునకాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
మంటల ధాటికి సిలిండర్ కాస్త పేలడంతో ఆ శునకం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. శునకం గట్టిగా అరుస్తూ అందరినీ కాపాడింది కానీ.. సిలిండర్ పేలడంతో ఆ శునకం మాత్రం నిప్పుకు ఆహుతి అయ్యిందని చెప్పారు. ఇకపోతే.. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తేల్చారు. అగ్నిమాపక సిబ్బంది.. గంటల పాటు పోరాడి మంటలను ఆర్పినట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షణ్ముఖ్ జశ్వంత్.. అబ్బ నీ తియ్యని దెబ్బతో వచ్చేస్తున్నాడు.. (వీడియో వైరల్)