Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14 సార్లు చేశాను... ఇక నా వల్ల కాదు...

Advertiesment
14 సార్లు చేశాను... ఇక నా వల్ల కాదు...
, సోమవారం, 11 మార్చి 2019 (18:52 IST)
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులను ఎంపిక చేయడం, ఖరారు చేయడం వంటి అంశాలలో తలమునకలై ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కొంతమంది రాజకీయ కురువృద్ధులు సమాలోచనలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. అయితే తమ కుటుంబంలోని వారు మాత్రం పోటీలో నిలుస్తారని వెల్లడించారు. ఇప్పటికే తాను 14 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసానని, విశ్రాంతి తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. 
 
కూతురు సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలో దిగనున్నారని చెప్పాడు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీ చేయలేదు. అయితే ఈసారి మాత్రం పోటీ చేస్తారని పార్టీనేతలు, కార్యకర్తలు భావించారు. తాజా నిర్ణయంతో తాను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్.. నా కుమార్తెను మళ్లీ మళ్లీ చంపుతున్నారు... చూడలేకపోతున్నా...