బ్రేకింగ్ న్యూస్ - మెగాస్టార్‌తో 'పాతాళ భైరవి' తీయనున్న 'మహానటి' డైరెక్టర్..!
						
		
						
				
నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోన్న పేరు ఇది. తన తొలి ప్రయత్నంగా ఎవడే సుబ్రమణ్యం సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కానీ... నాగ్ అశ్విన్ టాలెంట్‌ని ఇండస్ట్రీలో పెద్దగా గుర్తించలేదు. ఎప్పుడైతే.. మహానటి సినిమా తీస
			
		          
	  
	
		
										
								
																	నాగ్ అశ్విన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగుతోన్న పేరు ఇది. తన తొలి ప్రయత్నంగా ఎవడే సుబ్రమణ్యం సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు కానీ... నాగ్ అశ్విన్ టాలెంట్‌ని ఇండస్ట్రీలో పెద్దగా గుర్తించలేదు. ఎప్పుడైతే.. మహానటి సినిమా తీసి సంచలన విజయం సాధించాడో.. అందరి దృష్టి నాగ్ అశ్విన్ పైనే పడింది. 
	
 
									
										
								
																	
	 
	ఇక అసలు విషయానికి వస్తే... మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మహానటి నిర్మాతలు స్వప్నదత్, ప్రియంకా దత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌లను ఇంటికి పిలిచి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి తాను నాగ్ అశ్విన్‌తో సినిమా చేసేందుకు రెడీ అని చెప్పగా.. నాగ్ అశ్విన్ తను చిరంజీవి గారి కోసం కథ రెడీ చేస్తున్నానని చెప్పారు. ఈ సినిమాని తమ సంస్థే నిర్మిస్తుందని అశ్వనీదత్ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ... తనతో పాతాళ భైరవి లాంటి సినిమా తీయాలనుంది నాగ్ అశ్విన్ చెప్పాడని నవ్వుతూ అన్నారు.
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కాబట్టి... చిరంజీవి 152వ చిత్రం వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఉండచ్చు. ఇదే కనుక జరిగితే... నాగ్ అశ్విన్‌కి బంపర్ ఆఫరే..!