Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ బయోపిక్ : కథ అక్కడ నుంచే ప్రారంభం... లక్ష్మీ పార్వతి సీన్స్ లేనట్టేనా?

తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తొలి బయోపిక్ మూవీ "మహానటి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించింది. ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు ప్ర

Advertiesment
ఎన్టీఆర్ బయోపిక్ : కథ అక్కడ నుంచే ప్రారంభం... లక్ష్మీ పార్వతి సీన్స్ లేనట్టేనా?
, గురువారం, 10 మే 2018 (14:53 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తొలి బయోపిక్ మూవీ "మహానటి". ఈ చిత్రం మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించింది. ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. పైగా, ఈ చిత్రం విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో "ఎన్టీఆర్ బయోపిక్" పనులను కూడా వేగవంతం చేయాలని భావిస్తున్నారు.
 
ఈ చిత్ర హీరో బాలకృష్ణ ఇదే అంశంపై దృష్టికేంద్రీకరించి, ప్రతి ఒక్కరూ మెచ్చేలా 'ఎన్టీఆర్ బయోపిక్‌'ను తెరకెక్కించాలన్న సంకల్పంతో ఉన్నారట. అయితే, ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్న దానిపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. నిజానికి తేజ దర్శకత్వం వహించాల్సి వుండగా, ఆయన ఈ ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. దీంతో దర్శకుడు ఎవరన్నదానిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. 
 
ఇకపోతే, ఈ చిత్ర కథ కూడా ఎన్టీఆర్ బాల్యం నుంచి కాకుండా 1980లో ఆంధ్రా పాలిటిక్స్ మార్చిన తిరుప‌తి బ‌హిరంగ స‌భ నుండి మొద‌లు కానుంద‌ట‌. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండ‌గా, ఇందులో 64 పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నాడు. బాల‌య్య హెలికాఫ్ట‌ర్ ఎంట్రీ సీన్స్ ఆడియన్స్ రోమాలు నిక్క‌పొడుచుకునేలా ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ చిత్రం మ‌రొ కొద్ది రోజుల‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. ఈ చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి, విష్ణువ‌ర్ధ‌న్‌, బాల‌య్య సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ మైకేల్ జాక్సన్‌ను పెళ్లాడేందుకు సై : పవన్ హీరోయిన్