Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్?

మహానటుడు స్వర్గీయ ఎన్టీ. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, ఆయన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ద

Advertiesment
బాలకృష్ణ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్?
, ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (10:48 IST)
మహానటుడు స్వర్గీయ ఎన్టీ. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, ఆయన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించేవారు ఎవరన్నదానిపై పలు రకాల సందేహాలు ఉత్పన్నమయ్యాయి.
 
ఈనేపథ్యంలో కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, క్రిష్, కృష్ణవంశీ వంటి వారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి బాలకష్ణ దర్శకత్వం వహించే అవకాశం వుందని తెలుస్తున్నది. భారీ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నందున.. ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీపడొద్దని బాలయ్య నిర్ణయించుకున్నారట. 
 
అందుకే స్వయంగా ఆయనే రంగంలోకి దిగబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలకృష్ణ దర్శకత్వంలో 'నర్తనశాల' పేరుతో ఓ చిత్రం ప్రారంభం జరుపుకొని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా బాలకృష్ణ మరోమారు దర్శకత్వం వైపు దృష్టిసారించడం పరిశ్రమ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు 'భ‌ర‌త్ అనే నేను' అసెంబ్లీ మేకింగ్ వీడియో