Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం.. బాలయ్య ఆ టైప్.. జగన్‌ను కలుస్తా!: విష్ణు కుమార్

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని.. మే 15వ తేదీకి తర్వాత అన్నీ వ

Advertiesment
2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయం.. బాలయ్య ఆ టైప్.. జగన్‌ను కలుస్తా!: విష్ణు కుమార్
, సోమవారం, 23 ఏప్రియల్ 2018 (19:23 IST)
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని.. మే 15వ తేదీకి తర్వాత అన్నీ విషయాలను బహిర్గతమనవుతాయని తెలిపారు.


దమ్ముంటే కేసులు పెట్టాల్సిందిగా కొందరు టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారని.. త్వరలోనే వారి కోరిక తీరుస్తామని విష్ణుకుమార్ రాజు అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. అంతేగాకుండా రూ.9,300 కోట్లను ఏపీకి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. 
 
అయితే తెలుగుదేశం పార్టీ తీసుకునేందుకు సిద్ధంగా లేదని.. తద్వారా ఏపీ ప్రజలకు టీడీపీ స్వార్థ ప్రయోజనాల కోసం అన్యాయం చేస్తుందని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. 30వ తేదీన చంద్రబాబు చేపట్టనున్న దీక్ష కూడా స్వార్థపూరితమైనదే అని అన్నారు. చెప్పిందే చెబుతూ ముఖ్యమంత్రి అందరికీ బోర్ కొట్టిస్తున్నారని తెలిపారు.

ఈసారి మాట్లాడేటప్పుడు ఒక ఆర్కెస్ట్రా కూడా పెట్టించాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేపట్టిన దీక్షతో రూ. 20 నుంచి 30 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయిందని చెప్పారు. అలాగే పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విశాఖపట్నం చేరుకున్నాక... తన మామగారి కోసం జగన్‌ను కలుస్తానని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అలాగే ప్రధాని మోదీపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దుయ్యబట్టారు. జనాల్ని చూస్తే బాలయ్య రెచ్చిపోతారని ఎద్దేవా చేశారు. బాలయ్య నోటిదురుసుతనంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌ సహనం సహనం... పడ్డవాడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు...