నాది అలవాటైన ప్రాణం... ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్‌సీపీ ఎంపీలతో జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే... దీక్ష చేస్తోన్న ఎంపీలతో వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే... దీక్ష చేస్తోన్న ఎంపీలతో వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మిథున్, అవినాశ్‌లతో జగన్ మాట్లాడుతూ... రాష్ట్రం గర్వపడేలా మీరు ఆమరణదీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి గర్విస్తున్నారన్నారు.
ఐదు మంది వైయస్సార్‌సీపీ ఎంపీల పోరాటాన్ని ప్రజలు జీవితకాలంలో మరిచిపోలేరు. మీరు చూపించిన నిబద్ధత, అంకితభావం మరిచిపోలేనిది. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీ పోరాటానికి నా అభినందనలు అని తెలియచేసారు జగన్. పోరాటాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలన్నదే మన ఉద్దేశం. రాష్ట్రంలో పోరాటం కొనసాగించడం కోసం కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎంపీలకు సంఘీభావం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కోసం రహదారి దిగ్బంధనాల సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
మన పోరాటాలను భగవంతుడు చూస్తున్నాడు, తప్పకుండా మేలు చేస్తాడు అన్నారు వైఎస్ జగన్. నిరాహారదీక్షలు ఎంత కష్టపడి చేశారో... ఇప్పుడు మాకు తెలుస్తోంది అని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో ఎంపీ మిథున్ రెడ్డి అనగా.. నాది అలవాటైన ప్రాణం అని వైఎస్ జగన్ అన్నారు. మీరు నిరాహార దీక్ష చేపట్టి ఐదురోజులు అయ్యింది. 4 రోజులుగా ఆహారం తీసుకోకుంటే.. కీటోన్స్ శరీరంలో పెరుగుతాయి. నీళ్లు బాగా తాగి డ్రీ హైడ్రేషన్ కాకుండా చూసుకోండి అని జగన్ అనగా.. పోరాటాన్ని ఆపేది లేదు.. కొనసాగిస్తామని ఎంపీ అవినాశ్ రెడ్డి తెలియచేసారు.