ఎన్టీఆర్ బయోపిక్ డైరెక్టర్ ఆయనే.. కానీ పర్యవేక్షక దర్శకుడిగా...
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, ఆయన అర్థాంతరంగా తప్
స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే, ఆయన అర్థాంతరంగా తప్పుకున్నారు. దీంతో దర్శకత్వం బాధ్యతలను ఈ చిత్రం హీరో నందమూరి బాలకృష్ణే చేపట్టనున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను ఆయన పోషించడమే కాదు.. ఆయనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెగ్యులర్ షూటింగు ఎప్పుడు మొదలవుతుందా? అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తుండగా, దర్శకుడు తేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో తానే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను చేపట్టాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారు.
అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేసి పెట్టమని ఆయన కె.రాఘవేంద్రరావు.. క్రిష్.. కృష్ణవంశీలను సంప్రదించారట. అయితే ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉండటం వలన కుదరదని చెప్పారట. ఈ నేపథ్యంలో తెరపైకి 'చంద్ర సిద్ధార్థ' పేరు వచ్చింది. 'ఆ నలుగురు' సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న చంద్ర సిద్ధార్థ ఈ సినిమా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయం అధికారికంగా వెలువడవలసి వుంది.