Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోదీపై బాలకృష్ణ విమర్శలు.. అవి ఏపీ ప్రజల ఆవేదన మాత్రమే

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోదీని శిఖండి

ప్రధాని మోదీపై బాలకృష్ణ విమర్శలు.. అవి ఏపీ ప్రజల ఆవేదన మాత్రమే
, ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (17:36 IST)
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒక్కరోజు దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతూ.. మోదీని శిఖండి అని, తరిమితరిమి కొడతామన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రధాని మోదీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని బాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు చిలకలూరి పేటలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు.. ఏపీ ప్రజల మనోవేదన అన్నారు. 
 
కాస్టింగ్ కౌచ్‌పై బాలయ్య స్పందిస్తూ.. తెలుగు సినీ పరిశ్రమలో చెలరేగుతోన్న వివాదంపై పెద్దలు కూర్చొని మాట్లాడటం శుభపరిణామమన్నారు. కాగా కేఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్‌ నిర్మించిన ''జై సింహ'' ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ సినిమా శనివారం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దొషీ నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష.. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం.. సంతోష్ ఏమన్నారంటే?