Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని మోదీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: కేవీపీ రామచంద్రరావు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కూడా కేవీపీ మండిపడ్డారు. అఖిలపక్షం పేరుతో చం

ప్రధాని మోదీ నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: కేవీపీ రామచంద్రరావు
, ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (18:00 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై కూడా కేవీపీ మండిపడ్డారు. అఖిలపక్షం పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని.. అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీలేవీ వెళ్ళకపోవడం చంద్రబాబుకు సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
అఖిలపక్షం పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని కేవీపీ మండిపడ్డారు. ఇక పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నటనకు ఆస్కార్ ఇవ్వాలని కేవీపీ ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియాతో కేవీపీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉన్నా కూడా అవిశ్వాసంపై చర్చకు రాకుండా చేయవచ్చనని తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట ధర్నాకు దిగిన తెలుగుదేశం ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు లాగి పడేశారు. 
 
ప్రధాని ఇంటి ముట్టడికి టీడీపీ ఎంపీలు యత్నించగా, వారి నిరసనల గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించడంతో పాటు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. నిషేధిత ప్రాంతమని నచ్చజెప్పినా ఎంపీలు వినకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ అవసరమా? చెన్నై టీమ్ నల్ల బ్యాడ్జ్ ధరించి ఆడండి: రజనీ