Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోదాను ప్యాకేజ్ కోసం చంద్రబాబు అమ్ముకున్నారు... కేవీపీ కామెంట్స్

రాజీనామా డ్రామాలు ఇవాళ కొత్తకాదు. టీడీపీ - బీజేపీ ఎప్పుడు హత్తుకుంటాయో... ఎప్పుడు విడిపోతాయో... ఎప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాయో చెప్పలేం. అవి వారికే తెలుసు... సామాన్యులకు అర్థం కాదు. రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి.

Advertiesment
హోదాను ప్యాకేజ్ కోసం చంద్రబాబు అమ్ముకున్నారు... కేవీపీ కామెంట్స్
, శుక్రవారం, 9 మార్చి 2018 (13:34 IST)
రాజీనామా డ్రామాలు ఇవాళ కొత్తకాదు. టీడీపీ - బీజేపీ ఎప్పుడు హత్తుకుంటాయో... ఎప్పుడు విడిపోతాయో... ఎప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఏ నిర్ణయాలు తీసుకుంటాయో చెప్పలేం. అవి వారికే తెలుసు... సామాన్యులకు అర్థం కాదు. రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి.  హోదాను ప్యాకేజ్ కోసం చంద్రబాబు అమ్ముకున్నారు. మోదీకి నైతిక విలువలుంటే... వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా ఇచ్చిన హామీలను  నెరవేర్చాలి. పదేళ్లు స్టేటస్ ఇస్తానని మోదీ చెప్పారు... దాన్ని తర్వాత విస్మరించారు.
 
హామీని మోదీ పాతిపెడితే... చంద్రబాబు కిమ్మనలేదు. కాంగ్రెస్ మాత్రమే అన్నిరకాల పోరాటాలు చేస్తోంది. కనీసం ప్రశ్నించకుండా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని చప్పరించుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో నిధులు తమ ఆధీనంలో ఉంటే చాలనుకున్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చిన నిధులను సొంతానికి అనుభవిస్తామనుకున్నారు. తనకు ముట్టాల్సింది ముట్టకపోవడంతో టీడీపీ ఇప్పుడు రాజీనామా డ్రామాలాడుతోంది.
 
కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్‌ల విషయంలో తేడాలు రావడంతోనే ఇప్పుడు పోరాటం అంటున్నారు. విజయవాడ నుంచి రాహుల్ ర్యాలీ నిర్వహిస్తే... కాన్వాయ్‌కు నల్లజెండాలు చూపించేలా, కోడిగుడ్లు విసిరేలా టీటీపీ చేసింది. స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామాలు చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారు.

మళ్లీ ప్యాకేజ్ ప్రకటిస్తే... నిధులకు లెక్కలడకగపోతే చాలు మళ్లీ కేంద్రంలో టీడీపీ ప్రవేశిస్తుంది. కేంద్రం నుంచి బయటకొచ్చాం తప్ప... ఎన్డీఏ నుంచి బయటకు రాలేదని వారే చెప్పారు. మళ్లీ చేరడానికి మార్గాలను తెరిచిపెట్టుకునే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై బీజేపీ, టీడీపీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ మూడేళ్ల క్రితమే స్టేటస్ కోసం పోరాటం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీగారు.. మీకు మూడిందా? : కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్