Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశిరేఖ గెటప్‌లో కీర్తిసురేష్‌ని చూసి షాకయ్యా.. జెమినీ గణేశన్‌పై సావిత్రిది పిచ్చిప్రేమ

అలనాటి నటి సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన ''మహానటి'' సినిమాకి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చిన సాయిమాధవ్ బుర్రాకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిమాధవ్ మాట్లాడు

Advertiesment
శశిరేఖ గెటప్‌లో కీర్తిసురేష్‌ని చూసి షాకయ్యా.. జెమినీ గణేశన్‌పై సావిత్రిది పిచ్చిప్రేమ
, శుక్రవారం, 11 మే 2018 (16:03 IST)
అలనాటి నటి సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన ''మహానటి'' సినిమాకి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చిన సాయిమాధవ్ బుర్రాకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయిమాధవ్ మాట్లాడుతూ.. జెమినీ గణేశన్ గురించి చెప్పారు. తనకు భార్యాపిల్లలు వున్నారనే విషయాన్ని సావిత్రితో పెళ్లికి ముందే జెమినీ గణేశన్ చెప్పారు. ఆయనను వివాహం చేసుకుంటే సావిత్రి జీవితం ఇలా వుంటుందనే విషయాన్ని కూడా సావిత్రికి చాలామంది తెలిపారు. 
 
కానీ సావిత్రిగారి అమాయకత్వం, ఆమె పిచ్చిప్రేమ, ఆ ప్రేమ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడటంతోనే జరగాల్సిందంతా జరిగిపోయిందని సాయిమాధవ్ తెలిపారు. దీంతో ఎదుటివ్యక్తి పట్ల గల ప్రేమను తనపై కోపంగా మార్చుకోవడం సావిత్రిగారు చేశారు. ఇక జెమినీ గణేశన్‌గారు ప్రాక్టికల్‌గా ఆలోచించారు. ఆయన వల్లనే సావిత్రి మానసికంగా కుంగిపోయారు. వాళ్లిద్దరూ మంచి తల్లిదండ్రులు కాగలిగారు గానీ, మంచి భార్యాభర్తలు కాలేకపోయారని, కానీ గొప్ప ప్రేమికులని చెప్పారు. జెమినీ గణేశన్‌ వల్ల సావిత్రి మానసికంగా కుంగిపోయి.. మనకు దూరమైపోయారని తెలిపారు.  
 
అంతేగాకుండా కీర్తి సురేష్ సావిత్రిలా కనిపించడం వెనుక మేకప్ పాత్ర కూడా కొంతవరకూ ఉంటుందని సాయిమాధవ్ తెలిపారు. కానీ మేకప్ వల్లనే అది కుదిరే పని కాదు. వేరే అమ్మాయిని తీసుకొచ్చి అదే మేకప్ వేయిస్తే సావిత్రిలా ఉంటుందా? ఉండదు.. కీర్తి సురేశ్ కనుకనే సరిపోయిందని ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ సాయిమాధవ్ చెప్పారు. తాను లొకేషన్లో ''మాయాబజార్'' సెట్లో శశిరేఖ గెటప్‌లో వున్న కీర్తి సురేశ్‌ను చూసి సావిత్రి గారు అనుకున్నాను. కీర్తి సురేశ్.. సావిత్రిలా కనిపించడం వేరు.. ఆమెలా నటించడం వేరు" అంటూ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''శ్రీదేవి'' మరణంపై దర్యాప్తు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు-బీమా పాలసీలపై?