Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మహానటి' అద్భుతం.. ఆ ముగ్గురిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి(Video)

అలనాటి సినీతార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ''మహానటి'' సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో మహానటి దుమ్మురేపుతోంది. యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్స్ వసూళ్లు స్టార్

Advertiesment
Mega Star
, శనివారం, 12 మే 2018 (12:02 IST)
అలనాటి సినీతార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ''మహానటి'' సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్సీస్‌లో మహానటి దుమ్మురేపుతోంది. యూఎస్‌లో ఈ సినిమా ప్రీమియర్స్ వసూళ్లు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వున్నాయి.


ప్రీమియర్స్ ప్రదర్శనతోనే మహానటి దాదాపు మూడు లక్షల డాలర్ల వసూళ్లను సాధించిందని సమాచారం. పెద్ద హీరోల సినిమాల ప్రీమియర్స్ వసూళ్లు దాదాపు ఇదే స్థాయిలో ఉంటాయని.. అదే స్థాయిలో మహానటి బయోపిక్‌కు ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపిస్తోందని సినీ పండితులు అంటున్నారు.  
 
మరోవైపు కేవలం ప్రీమియర్స్ వసూళ్లు మాత్రమే కాదు.. రివ్యూలన్నీ పాజిటివ్‌గా రావడం, ఈ సినిమాకు అదిరిపోయే రేటింగ్ రావడంతో వీకెండ్ కలెక్షన్లు కూడా అదిరిపోయే అవకాశాలున్నాయి. తొలి వీకెండ్‌లోపే ఈ సినిమా యూఎస్‌లో మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును అందుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సావిత్రి జీవితచరిత్రను ''మహానటి'' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్,  ప్రియాంక దత్‌లు నిర్మించారు. 
 
ఈ చిత్రానికి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి, తాజాగా నాగ్ అశ్విన్‌తో పాటు ప్రియాంక దత్.. స్వప్నదత్‌లను తన ఇంటికి ఆహ్వానించారు. ''మహానటి''ని అందంగా.. హృద్యంగా ఆవిష్కరించడంలో విజయవంతమయ్యారని, తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగిన ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ సత్కరించారు. కాగా కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన మహానటి సినిమా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చూడండి వీడియో.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది: దంగల్ జైరా వాసిమ్