Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో.. ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది: దంగల్ జైరా వాసిమ్

''దంగల్'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సరసన నటించి స్టార్ డమ్ తెచ్చుకున్న నటి జైరా వాసిమ్.. తీవ్రమైన ఒత్తిడిలో తానున్నానని, నిత్యమూ ఆత్మహత్య చేసుక

Advertiesment
Dangal
, శనివారం, 12 మే 2018 (10:51 IST)
''దంగల్'' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సరసన నటించి స్టార్ డమ్ తెచ్చుకున్న నటి జైరా వాసిమ్.. తీవ్రమైన ఒత్తిడిలో తానున్నానని, నిత్యమూ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలని అనిపిస్తోందని తెలిపింది. తానిప్పుడు జీవితంలోని అత్యంత కీలకమైన దశలో ఉన్నానని, అధిక ఒత్తిడి తనను పీడిస్తోందని.. ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు మందుకు కూడా వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. 
 
పాతికేళ్లు దాటినవాళ్లకే డిప్రెషన్‌ ఉంటుందని ఎక్కడో చదివాను. కానీ అది తప్పని అర్థం చేసుకున్నాను. 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా ఒత్తిడి తప్పదనేందుకు తానే ఒక ఉదాహరణ అంటూ జైరా తెలిపింది. నాలుగేళ్లుగా తీవ్ర ఒత్తిడి కారణంగా నిరాశ, నిస్పృహలకు గురవుతున్నానని, ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
నాలుగేళ్ల చికిత్స తర్వాత గానీ కోలుకోలేకపోయానని.. తనకున్న మానసిక రుగ్మత గురించి పూర్తిగా తెలియాలంటే 25 ఏళ్లు వచ్చే వరకూ ఆగాలని సలహా ఇస్తున్నారని చెప్పింది. తనకు 25 సంవత్సరాలు వచ్చే వరకూ ఇంతేనేమోనని, ఈలోగా ఏమైపోతానోనని వాపోయింది.

రాత్రి పూట దిగులుతో నిద్రపట్టట్లేదని.. తనలో కోపం పెరిగిపోతుందని.. అసహనం కారణంగా అన్నం ఎక్కువగా తినడంతో లావైపోయా అని తెలిపింది. రాబోయే పవిత్ర రంజాన్‌ మాసం అందుకు అనువైనదిగా భావిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు దయచేసి మీ ప్రార్థనల్లో తనను గుర్తు చేసుకోవాల్సిందిగా జైరా కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వేసవిలో సిమ్లా అందాలను చూడాలనుందా...? ఐతే ఇవి తెలుసుకోండి