Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోదుకూరులో దారుణం.. ఏడేళ్ల బాలికను రేప్ చేసిన 23యేళ్ల కామాంధుడు

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి ఇంకా ఏ ఒక్కరూ మరచిపోలేదు. ఈ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ ఘటన మరిచిపోకముందే గుంటూరు జిల్ల

Advertiesment
minor girl
, మంగళవారం, 8 మే 2018 (08:43 IST)
గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి ఇంకా ఏ ఒక్కరూ మరచిపోలేదు. ఈ లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ ఘటన మరిచిపోకముందే గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అదీ దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన మరునాడే, అంటే ఈనెల 3వ తేదీన ఏడేళ్ల బాలికపై దూరపు బంధువే అకృత్యానికి పాల్పడ్డాడు. మద్యం మత్తు తలకెక్కిన స్థితిలో, ఆ చిన్నారిని లైంగికంగా చిత్రవధ లైంగికదాడి చేశాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మోదుకూరులో కూలిపని చేసుకుని భార్యాభర్తలు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. పెద్ద అమ్మాయికి ఏడేళ్లు. ఆ ఇంటి పక్కనే దూరపు బంధువు నాగుల్‌మీరా (23) ఇల్లు ఉంది. గత గురువారం ఉదయాన్నే పిల్లలను ఇంటి దగ్గరే వదిలి తండ్రి వ్యవసాయ పనులకు వెళ్లిపోయాడు. ఏదో పనిమీద తల్లి తెనాలి వెళ్లింది. ఇంటి దగ్గర ముగ్గురు పిల్లలూ ఆడుకొంటున్నారు. 
 
ఆ రోజు పనికి పోకుండా మద్యం మత్తులో ఉన్న నాగుల్‌మీరా అటుగా వచ్చాడు. ఆడుకొంటున్న పిల్లల్లో ఏడేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆరోజు రాత్రి చిన్నారికి బాగా జ్వరం వచ్చింది. రెండురోజులు గడిచినా కోలుకోలేదు. ఆదివారం బట్టలు ఉతుకుతున్న తల్లి.. పాప గౌనుపై రక్తపు మరకలు చూసి భయపడింది. పాపను దగ్గర కూర్చోబెట్టుకొని ఆరాతీయగా జరిగిందంతా చెప్పేసింది. తల్లిదండ్రులు మరునాడు పాపను తీసుకొని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పాప ను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని దేశ ప్రధానిగా చేసి పశ్చాత్తాప పడుతున్నా : రాంజెఠ్మలానీ