Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడబిడ్డల జోలికొస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తాం : చంద్రబాబు హెచ్చరిక

ఆడబిడ్డల జోలికి వస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అంతేకాకుండా, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రక

ఆడబిడ్డల జోలికొస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తాం : చంద్రబాబు హెచ్చరిక
, మంగళవారం, 8 మే 2018 (08:25 IST)
ఆడబిడ్డల జోలికి వస్తే సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అంతేకాకుండా, ఆడబిడ్డలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.
 
గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటన నేపథ్యంలో మహిళల రక్షణపై అందరిలో చైతన్యం, అవగాహన పెంచేలా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 'ఆడబిడ్డలకు రక్షణగా... కదులుదాం' పేరిట ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడలో జరిగిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన సభలో ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాచార కేసుల్లో నిందితులను పోలీసులు ముసుగులేయకుండా రోడ్లపై నడిపిస్తారన్నారు. రౌడీషీట్లలాగా వారిపై 'లైంగిక నేరస్తుడి'గా ప్రకటిస్తూ రికార్డులు (సెక్సువల్‌ అఫెండర్‌ షీట్‌) తెరుస్తామని, ఆ వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని హెచ్చరించారు. జేబుదొంగల ఫొటోలు ప్రదర్శించినట్లుగానే.. అవసరాన్ని బట్టి రేపిస్టుల ఫొటోలను కూడా రద్దీ ప్రాంతాల్లో పెడతామని చెప్పారు. అత్యాచార కేసుల్లో దోషులకు సత్వర శిక్ష పడేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. 
 
అంతేకాకుండా, బాధితులను ఆదుకోవడంతోపాటు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని... ప్రతి ఆడబిడ్డకూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. దాచేపల్లిలో అకృత్యం గురించి తెలియగానే పోలీసు శాఖను అప్రమత్తం చేసి 17 బృందాలను రంగంలోకి దించామన్నారు. డ్రోన్లతో వెతుకులాట మొదలవగానే దిక్కుతోచక నిందితుడు ఉరేసుకున్నాడని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమాఖ్య పరిరక్షణకే ఆర్థిక మంత్రుల సమావేశం... కేంద్రంపై టార్గెట్...