Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ సీన్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను.. హ్యాపీగా క్లాప్స్ కొట్టేశాను: చిరు

''భరత్ అనే నేను'' సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ భరత్ అనే నేను సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది

ఆ సీన్‌కు నేను బాగా కనెక్ట్ అయ్యాను.. హ్యాపీగా క్లాప్స్ కొట్టేశాను: చిరు
, గురువారం, 3 మే 2018 (10:08 IST)
''భరత్ అనే నేను'' సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ భరత్ అనే నేను సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది. ప్రస్తుతం అమెరికాలో వున్న మెగాస్టార్ చిరంజీవి.. అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ.. భరత్ అనే నేను సినిమా ప్రశంసల జల్లు కురిపించారు.
 
తమ ఇంట్లోని వాళ్లందరూ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబును ఎక్కువగా ఇష్టపడతారు. అందువలన కుటుంబసభ్యులందరితో కలిసి తొలి రోజునే ఈ సినిమాను ఇంట్లోనే చూశాను. కమర్షియల్ హంగులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఈ సినిమా స్థాయి పెరిగింది. ఇక మహేశ్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని చిరంజీవి కితాబిచ్చారు. 
 
భరత్ సినిమాలో మహేష్ అద్భుతంగా నటించాడు. సినిమా చూసి వెంటనే మహేష్‌కు ఫోన్ చేసి అభినందించానని.. ఈ సినిమా చివరిలో వచ్చే విలేకరుల సమావేశం సీన్‌కు తాను బాగా కనెక్ట్ అయ్యానన్నాడు. జర్నలిస్టులను మహేశ్ ప్రశ్నిస్తున్నప్పుడు ఆనందంతో చప్పట్లు కొట్టేశానని చిరంజీవి వ్యాఖ్యానించారు. 
 
ఇదిలా ఉంటే.. సుమారు నెల రోజుల క్రితం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ''రంగస్థలం" రూ.200 కోట్ల క్లబ్‌లో ప్రవేశించింది. తద్వారా తొలి తెలుగు నాన్ బాహుబలి చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆ ఘనతను మహేష్ బాబు తాజా మూవీ భరత్ అనే నేను కొట్టేసింది. 'భరత్ అనే నేను' యూఎస్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
రిలీజ్ అయిన 30 రోజుల్లో రంగస్థలం రూ.200కోట్ల క్లబ్‌లో చేరితే.. భరత్ అనే నేను సినిమా 12 రోజుల్లోనే 'భరత్ అనే నేను' ఆ రికార్డును అధిగమించింది. అతి త్వరలోనే భరత్ అనే నేను రూ.250 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తుందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోసాని క్రిష్ణమురళికి అది ఉన్న మాట వాస్తవమే - కొరాటాల శివ