Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగ్ - ప్ర‌భాస్ మ‌ధ్య పోటీయా..? నిజ‌మా..?

Advertiesment
నాగ్ - ప్ర‌భాస్ మ‌ధ్య పోటీయా..? నిజ‌మా..?
, బుధవారం, 15 మే 2019 (20:01 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌న్మ‌థుడు 2. చిల‌సౌ డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. మ‌నం ఎంట‌ర్టైన్మెంట్స్, ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన నాగార్జున‌, కిర‌ణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పోర్చుగ‌ల్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈ నెల 21 నుంచి హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేసారు. 
 
ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ నాగ్ స‌ర‌స‌న న‌టిస్తుంటే.. స‌మంత ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రాన్ని ద‌స‌రాకి రిలీజ్ చేస్తారు అంటూ వార్త‌లు వ‌చ్చాయి కానీ... నాగార్జున మాత్రం ఆగ‌ష్టులో రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. ఎందుకంటే ద‌స‌రాకి సైరా వ‌స్తుంది. పైగా షూటింగ్ కంప్లీట్ అయిన త‌ర్వాత అన్ని రోజులు ఎందుకు ఆగ‌డం అనేది నాగ్ ఆలోచ‌న‌. 
 
అయితే... ఆగ‌ష్టులో ప్ర‌భాస్ సాహో రిలీజ్ ఉంది. దీంతో నాగ్ - ప్ర‌భాస్ పోటీ ప‌డ‌బోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది. వాస్త‌వం ఏంటంటే... సాహో ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అందుచేత నాగార్జున మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని త‌న పుట్టిన‌రోజు కానుక‌గా ఆగ‌ష్టు 29న రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. నాగ్ ప్లానింగ్ బాగానే ఉంది. మ‌రి...మ‌న్మ‌థుడు మ్యాజిక్ ని మన్మ‌థుడు 2 రిపీట్ చేస్తుందో లేదో..? 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా పెరిగిన కేజీఎఫ్ : చాప్టర్ 2 బడ్జెట్