Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెన్ష‌న్లో ప్ర‌భాస్ ఫ్యాన్స్... సాహో.. అస‌లు ఏం జ‌రుగుతోంది..?

Advertiesment
టెన్ష‌న్లో ప్ర‌భాస్ ఫ్యాన్స్... సాహో.. అస‌లు ఏం జ‌రుగుతోంది..?
, శనివారం, 4 మే 2019 (20:50 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్... తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... దేశ వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే విదేశాల్లో సైతం మారుమాగుతోన్న పేరు ఇది. దీనంత‌టికీ కార‌ణం అంద‌రికీ తెలిసిందే... బాహుబ‌లి. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబలి 1, బాహుబ‌లి 2 చిత్రాల‌తో ప్ర‌భాస్‌కి రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న‌ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. 
 
ప్రభాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రాన్ని వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఆగ‌ష్టు 15న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు కానీ... సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌డం లేదు. దీంతో ఫ్యాన్స్ బాగా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. 
 
అస‌లు సాహో గురించి ఏం జ‌రుగుతోంది. ఎందుకు సినిమా గురించి ఏ విష‌యాన్ని తెలియ‌చేయ‌డం లేదు అని. ఫ్యాన్స్ టెన్ష‌న్ గురించి ప్ర‌భాస్‌కి కూడా చెప్పార‌ట‌. ఎలాంటి టెన్ష‌న్ అవ‌స‌రం లేద‌ని సినిమా చాలా బాగా వ‌స్తుంద‌ని ప్ర‌భాస్... ఫ్యాన్స్‌కి చెప్పాడ‌ట‌. 
 
 
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… ఇటీవ‌ల ముంబాయిలో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖ‌రున ప్ర‌భాస్ డ‌బ్బింగ్ చెప్ప‌నున్నార‌ని తెలిసింది. సాహోని ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్‌తో పాటు హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు వ‌ర్క్ చేస్తున్నారు.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున ఆగ‌ష్టు 15న‌ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దొంగే దొంగ దొంగ అని అరిచిన‌ట్లుంది.. జోడి చిత్ర వివాదంపై వివరణ..!