Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హమ్మయ్య.. హీరో ప్రభాస్‌కు ఊరట.. వందల ఎకరాల భూవివాదానికి ఫుల్ స్టాప్

Advertiesment
actor prabhas
, బుధవారం, 24 ఏప్రియల్ 2019 (11:04 IST)
హమ్మయ్య హీరో ప్రభాస్‌కు ఊరట లభించింది. వందల ఎకరాల భూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా హైకోర్టు సూచనలు చేసింది. లీగల్ దస్తావేజుల ద్వారా ప్రభాస్ భూమిని కొనుగోలు చేశారు. దీనిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదనే క్రమబద్ధీకరణ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు.


అయినప్పటికీ అధికారులు దాన్ని పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి ఈ భూముల వ్యవహారంలో ప్రభాస్‌ హక్కుల జోలికి తాను వెళ్లడం లేదని తెలిపింది. ఫలితంగా రంగారెడ్డి జిల్లా రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి విషయంలో ప్రభాస్‌కు హైకోర్టు ఊరట లభించింది. 
 
ప్రభాస్‌ స్వాధీనంలో ఉన్న భూమి నుంచి ఖాళీ చేయించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం నిర్దేశించిన విధి విధానాలను అనుసరించలేదని స్పష్టం చేసింది. భూ క్రమబద్దీకరణకు అతను దరఖాస్తు పెట్టుకుంటే, విస్తృత ప్రజాప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న 8 వారాల్లో ఆ దరఖాస్తుపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్‌తో ఆ సినిమాలో నటించనంటున్న అనుష్క.. ఎందుకు..?