Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" సినిమా రిలీజ్ మరోమారు వాయిదా?

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (11:15 IST)
దర్శకధీరుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు నటిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". నిర్మాత డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల మరోమారు వాయిదాపడింది. నిజానికి గత 2020లోనే ఈ చిత్రం విడుదలకావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తితో పాటు.. వివిధ కారణాల రీత్యా వాయిదావేశారు. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా ప్రభావంతో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. దీంతో ప‌లు సినిమాలు ద‌స‌రా బ‌రిలో విడుద‌ల‌కి సిద్ధం అవుతున్నాయి.
 
ఇప్ప‌టికే అజ‌య్ భూప‌తి డైరెక్ట్ చేస్తున్న "మ‌హాస‌ముద్రం" ద‌స‌రా బ‌రిలో ఉంది. అక్టోబ‌ర్ 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే కాంబోలో వ‌స్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్" కూడా అక్టోబ‌ర్ 8న విడుద‌ల కానుంది. "దృశ్యం 2@ చిత్రాన్ని కూడా ద‌స‌రా బరిలో నిల‌పాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు కొద్ది రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి.
 
మ‌లయాళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా వ‌స్తుంది దృశ్యం 2. వెంక‌టేష్‌,మీనా, కృతిక‌, ఎస్తేర్ అనిల్‌, న‌దియా, సంప‌త్ రాజ్, న‌రేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్, ఆశీర్వాద్ సినిమాస్‌, రాజ్ కుమార్ థియేట‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మూసారంబాగ్‌, మూసీ నదులు ఉగ్రరూపం.. (video)

దసరాకు బంద్ కానున్న మద్యం షాపులు.. డీలా పడిపోయిన మందు బాబులు

ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టిన ప్రేమికుడు (video)

సుగాలి ప్రీతి కేసు: ఇచ్చిన మాట నెలబెట్టుకున్న పవన్- చంద్రబాబు

Pawan Kalyan : నాలుగు రోజులు వైరల్ ఫీవర్- హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments