Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ దిగ్గజాల నడుమ చెర్రీ - శంకర్ సినిమా ప్రారంభం

Advertiesment
సినీ దిగ్గజాల నడుమ చెర్రీ - శంకర్ సినిమా ప్రారంభం
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:00 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ దర్శకుడు శంకర్ కాబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. 
 
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 
 
ఇక ఈ సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు.
webdunia
 
"వీ ఆర్ కమింగ్'' అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. కాగా, ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి, చిరంజీవి, రణ్‌వీర్ సింగ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆది షర్ట్ విప్పిన యాంకర్ అనసూయ, ప్యాంటు కూడా విప్పుతానంటే...