Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా- సురేందర్ రెడ్డి ప్రచార చిత్రాలు విడుదల

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా- సురేందర్ రెడ్డి  ప్రచార చిత్రాలు విడుదల
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:45 IST)
pawna on byke still
పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లు కాంబినేషన్లో గతంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందో, ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది ఈ సంస్థ. నేడు పవన్ కళ్యాణ్ గారు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రానికి సంబంధించి ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం.
 
ఈ ప్రచార చిత్రాన్ని గమనిస్తే, ఆధునిక వాహనం పై పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా కూర్చుని ఉండటం కనిపిస్తుంది. అయితే పవన్ కల్యాణ్ ను పూర్తిగా చూపించకుండ ఉండటాన్ని ప్రీ లుక్ గా భావించాలని చిత్ర బృందం చేసిన ప్రయత్నం హర్షించదగ్గది. అయినా ప్రచార చిత్రం యువతను కిర్రెక్కిస్తోంది. అభిమాన యువతలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం 'జాతర షురూ' అన్న ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి. 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అయాంక బోస్ ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తున్నారు. కళా దర్శకుడు గా ఆనంద సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్, పోరాటాలు రామ్ లక్ష్మణ్ పేర్లు ప్రధాన సాంకేతిక నిపుణులుగా ఈ ప్రచారచిత్రం లో కనిపిస్తాయి. 
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు నిర్మాతలు. 
 

సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం అధికారిక ప్రకటన 
 
webdunia
pavan new move poster
పవన్ కళ్యాణ్  హీరోగా రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్ సంస్థ  చిత్రం విషయమై అధికారిక ప్రకటన ఈ రోజు విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
 
ప్రచార చిత్రాన్ని గమనిస్తే,. ఓ వైపు తుపాకి, "యధా కాలమ్.. తధా వ్యవహారం" అన్న పదాలు కనిపిస్తాయి. నగర వాతావరణం అగుపిస్తుంది. కథా బలం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ తమ 9 వ చిత్రం గా ప్రకటించిన ఈ చిత్రానికి వక్కంతం వంశి రచయిత.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొఘ‌లాయిల కాలంనాటి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుకు డేట్ ఫిక్స్ అయింది