Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప‌వ‌న్ 50వ జ‌న్మ‌దినోత్స‌వం.... జ‌న సైనికుల హంగామా!

ప‌వ‌న్ 50వ జ‌న్మ‌దినోత్స‌వం.... జ‌న సైనికుల హంగామా!
విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (18:18 IST)
జ‌న‌సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలు విజ‌య‌వాడ పశ్చిమ నియోజకవర్గంలో గురువారం ఘనంగా జరిగాయి నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ నగరాధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఈ సంద‌ర్భంగా ప‌లుచోట్ల జ‌రిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1. 47 డివిజన్‌లో వేంపల్లి గౌరీశంకర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ 50వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని 50 కేజీల భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పడకేసిందని అందుకనే రాష్ట్రవ్యాప్తంగా గోతులు, రోడ్ల కనీస మరమ్మతులు సైతం జగన్ ప్రభుత్వం చేయడం లేదని, ప్రభుత్వం మొద్దు నిద్ర లేపేందుకే పవన్ కళ్యాణ్ డిజిటల్ మీడియా ద్వారా గోతులు పడ్డ రోడ్లను ఫోటోలు తీసి నిరసన తెలియజేసేలాగా పిలుపునిచ్చారని చెప్పారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం రూ.600 కోట్లు కేటాయించారని మేయర్, వైసిపి కార్పొరేటర్లు పదేపదే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజంగా ఆరు వందల కోట్లు విజయవాడ నగర అభివృద్ధికి కేటాయిస్తే ఎందుకు కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయడం లేదో  సమాధానం చెప్పాలని అన్నారు. 
 
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సితార సెంటర్ వద్ద, విఎం సి ప్రధాన కార్యాలయం రోడ్డులో, నెహ్రూ బొమ్మ సెంటర్, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో రోడ్లను సందర్శించి పార్టీ సూచించిన హాష్ ట్యాగ్ తో ఫోటోలను డిజిటల్ మీడియాలో ప్రచారం చేశామ‌న్నారు. 
. అనంతరం  పూల మార్కెట్ వద్ద 30 కేజీల భారీ కేకును పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీను నాయుడు మిత్ర బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 53వ డివిజన్ కోమల విలాస్ సెంటర్ వద్ద నల్లబెల్లి కనకారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసి అనంతరం ఐదు వందల మంది పేదలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
. 44వ డివిజన్ నాయకులు మల్లెపువ్వు జయలక్ష్మి సురేష్ , 45వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు బొమ్మ గోవిందు లక్ష్మీ రాంబాబు సితార సెంటర్ వద్ద,  26వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు షేక్ అమిర్ భాష షర్మిల దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమోసాలకు సీరియర్ నంబర్.. ఎక్కడ?